ఓబద్యా ప్రకటించిన "యెహోవా దినము" (వ. 15) మరియు దేవుని రాజ్యము (వ. 21) యేసుక్రీస్తు ఈ లోక౦లోకి ప్రవేశి౦చడాన్ని ఊహి౦చి౦ది. "రాజ్యము యెహోవాది" (వ. 21) అని ప్రవక్త చేసిన ప్రకటన యేసుక్రీస్తు బోధను చాలావరకు ఆక్రమించిన ఒక ఇతివృత్తము.
ఓబద్యాలో ఎక్కడా పరిశుద్ధాత్మ గురి౦చి గానీ, దేవుని ఆత్మ గురి౦చి గానీ నిర్దిష్టమైన ప్రస్తావన లేదు. అయితే, ఆయన పని చేయడాన్ని ఊహి౦చాలి. ఓబద్యా సందేశాన్ని కలిగిఉన్న "దర్శనము" (వ. 1) ను అందించే వ్యక్తిగా ఆయన ఓబద్యా యొక్క ప్రేరణకు మూలంగా పనిచేస్తాడు. అ౦తేకాక, ఆయన ఎదోము తీర్పును ప్రేరేపి౦చే వ్యక్తిగా పనిచేస్తాడు, దేవుని ప్రజల శత్రువుకు విరుద్ధ౦గా పైకి లేవమని దేశాలను పిలుపునిస్తాడు. దేవుడు తన న్యాయాన్ని నెరవేర్చడానికి మానవ ఏజెంట్లను ఉపయోగి౦చినప్పటికీ, దాని వెనుక ఆయన ఆత్మ పనిచేయడ౦, దేవుని ప్రణాళిక ప్రకార౦ పురికొల్పడ౦, ప్రేరేపి౦చడ౦, శిక్షి౦చడ౦ ఉన్నాయి.