🏠 హోమ్ పేజీ

పరిచయము

అవగాహన

విశేషములు

దేవుని ప్రత్యక్షత

ప్రధాన అంశములు

నేర్చుకొనవలసిన పాఠములు

స్తుతి, ఆరాధన అంశములు

నిర్మాణము

Bible Project Poster

అధ్యాయములు

అధ్యాయము విషయము
1 కెబారు నదీప్రదేశమున యెహెజ్కేలు ప్రవచనము. నాలుగు జీవులు మరియు దేవుని మహిమ యొక్క దర్శనము
2 యెహెజ్కేలు నియామకము మరియు ఉపదేశము
3 యెహెజ్కేలు గ్రంధమును తినుట, ఇశ్రాయేలునకు హెచ్చరిక
4 యెరూషలేము యొక్క ముట్టడి ముందుగా చెప్పబడుట
5 యెరూషలేము యొక్కకరువు, తెగుళ్లు, దాడి,చెదరిపోవుట గురించి ముందుగా చెప్పుట
6 విగ్రహారాధన విషయమై ఇశ్రాయేలునకు తీర్పు, కాని శేషము మిగల్చబడును
7 నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నది
8 దేవాలయములోని విగ్రహారాధన గురించి యెహెజ్కేలునకు దర్శనము
9 విగ్రహారాధికుల వధ గురించి దర్శనము
10 దేవుని మహిమ దేవాలయము విడిచి వెళ్లుట గురించి దర్శనము
11 దుష్ట పరిపాలకులకు తీర్పు, ఇశ్రాయేలు తిరిగి వచ్చుట గురించి వాగ్ధానము
12 యెహెజ్కేలు చెరకోనిపోవుట గురించి భయపడుట
13 అబద్ద ప్రవక్తల గద్దింపు
14 విగ్రహారాధికులు నిషేదింపబడుట, తీర్పు అనివార్యము
15 యెరూషలేము పనికిరాని కొమ్మ
16 విస్వాసఘాతకురాలైన యెరూషలేము మరియు దేవుని కృప
17 రెండు పక్షిరాజులు, ద్రాక్షవల్లి ఉపమానము
18 దేవుడు తన న్యాయమును కాపాడుతూ పశ్చాత్తాపము కొరకు బోధించుట
19 ఇశ్రాయేలు రాజుల కొరకు విలాపము, సింహముల గురించిన ఉపమానము
20 దేవుడు ఇశ్రాయేలీయుల పెద్దలను తిరస్కరించుట, యెరూషలేము నాశనము చేయబడి తిరిగి కట్టబడుట
21 పదునుగలదై మెరుగుపెట్టియున్న ఖడ్గము యొక్క ఉపమానము
22 యెరూషలేము యొక్క పాపముల చిట్టా
23 ఒహొలా, ఒహొలీబా యొక్క పాపము తీర్పు
24 మసలుచున్న కుండ యొక్క ఉపమానము, యెహెజ్కేలు భార్య మరణము
25 అమ్మోనీయులు, ఎదోమీయులు, మోయాబీయులు, ఫిలిష్తీయుల మీద దేవుని ప్రతీకారము
26 తూరు మీద తీర్పు
27 తూరు కొరకు విలాపము
28 తూరు సీదోనుల మీద దేవుని తీర్పు
29 ఇగుప్తు గురించి ప్రవచనము
30 ఇగుప్తు కొరకు విలాపము, బబులోను విజయము
31 అష్షూరీయుల గతి గురించి దేవుడు ఫరోను హెచ్చరించుట, అష్షూరీయులు లెబనానులో దేవదారు వృక్షముల వంటివారు
32 ఫరో మరియు ఇగుప్తు గురించి విలాపము
33 యెహెజ్కేలు కావలివాడు, యెరూషలేము పట్టుకొనబడుట గురించి సమాచారము
34 ఇశ్రాయేలు కాపరులకు గద్దింపు, బాగుచేయుట
35 ఇశ్రాయేలీయుల మీద అసహ్యపడుట గురించి శేయీరు పర్వతమునకు తీర్పు
36 ఇశ్రాయేలు పర్వతములు దీవించబడును
37 ఎండిన ఎముకల లోయ గురించిన దర్శనము, యూదా ఇశ్రాయేలు ఏకమగుట
38 గోగు యొక్క అసూయ
39 గోగు మీద దేవుని తీర్పు, ఇశ్రాయేలు విజయము
40 క్రొత్త దేవాలయము ప్రాంగణము, ద్వారములు, ఆవరణములు, గదులు
41 దేవాలయము లోపలి కొలతలు, భాగములు, గదులు, అలంకరణములు
42 యాజకుల యొక్క గదులు
43 దేవుని యొక్క మహిమ తిరిగి దేవాలయము లోనికి ప్రవేశించుట, బలిపీఠము, అర్పణలు
44 తూర్పు ద్వారము రాజునకు మాత్రమే నియమించబడుట, లేవీయులకు విధులు
45 దేశములోని కొంత భాగము పరిశుద్ద స్థలమునకు, పట్టణమునకు, మహారాజుకు కేటాయించుట
46 మహారాజు యొక్క ఆరాధన కొరకు విధులు
47 దేవాలయము నుండి పవిత్ర నీరు, పొలిమేరలు ఏర్పరచుట
48 యాజకులు, మహారాజు, గోత్రములు, ద్వారముల కొరకు దేశము విభాగించుట