బైబిలులోని కొన్ని సందర్భములలో పంచకాండాలు “మోషే” అని సంబోధించబడ్డాయి
యోహాను 5:46; లూకా 24:27, 44
ఒక్క ఆదికాండము తప్ప పంచకాండాలులోని మిగిలిన పుస్తకములు మోషే రచయిత అని తెలియజేస్తున్నాయి నిర్గమకాండము 17:14; 24:3-4; 34:27; లేవీయకాండము 1:1; 4:1; 6:1, 8, 19, 24; 7:22, 28; 8:1; సంఖ్యాకాండము 33:2; ద్వితియోపదేశాకాండము 1:1; 17:18-19; 27:1-8; 28:58, 61; 29:19-20, 27; 30:10; 31:9-11, 24-26
పాత నిబంధన కూడా పంచకాండాలు రచించినది మోషే అని తెలియజేస్తుంది యెహోషువ 1:7-8; 8:31-32; 1 రాజులు 2:3; 8:9, 53; 2 రాజులు 10:31; 14:6; ఎజ్రా 6:18; నెహెమ్యా 13:1; దానియేలు 9:11-13; మలాకీ 4:4
ఆదికాండము లేకుండా నిర్గమకాండము సంపూర్ణము కాదు
యూదుల రచన అయిన తాల్ముడ్ కూడా పంచకాండాల రచయిత మోషే అని తెలియజేస్తుంది
నిర్గమకాండము 15:27 బట్టి మోషే ఆ గ్రంధములలోని సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి అని అర్ధము అవుతుంది
ఆదికాండమునందు ఇగుప్తునకు సంబంధించిన చాలా పదములు ఉపయోగించబడ్డాయి. ఆ కాలములోని యూదులలో మోషే తప్ప ఇగుప్తు గురించి ఎక్కువ తెలిసినవారు ఎవరూ లేరు. (అపోస్తలుల కార్యములు 7:22)
యోహాను 7:23 లో సున్నతి మోషే ధర్మశాస్త్రములో భాగము అని చెప్పబడినది. ఈ పద్దతి ఆదికాండము 17:12 లో మొదలు అయ్యింది. అలానే దీని గురించి నిర్గమకాండము 12:48, లేవీయకాండము 12:3 లో వ్రాయబడినది
నూతన నిబంధన అన్నిచోట్ల పంచకాండాల రచయిత మోషే అని పేర్కొనబడినది మత్తయి 8:4; 19:7-8; 23:2; మార్కు 1:44; 7:10; 10:3-4; 12:19, 26; లూకా 2:22; 5:14; 16:29-31; 20:37; 24:27, 44; యోహాను 1:17; 3:14; 5:45-46; 6:32; 7:19, 22-23; అపోస్తలుల కార్యములు 3:22; 13:39; 15:1, 5, 21; 26:22; 28:23; రోమీయులకు 10:5, 19; 1 కొరిందీయులకు 9:9; 2 కొరిందీయులకు 3:15; హెబ్రీయులకు 8:5
హీబ్రూలో నిర్గమకాండము మొదటిపదము “మరియు” తో మొదలవుతుంది. దీనినిబట్టి ఇది ఆదికాండమునకు కొనసాగింపు అని అర్ధము అవుతుంది
తన పుట్టుకకు ముందు జరిగిన సంగతుల గురించి పితరుల ద్వారా అయినా కాని లేదా దేవుని దగ్గరనుంచి కలిగిన ప్రత్యక్షత ద్వారా అయినా కాని మోషేకు తెలియజేయబడినది
పంచకాండాలు మొత్తముమీద ఉపయోగించిన రచనాశైలి కూడా అవి ఒక్క రచయిత చేతే రచించబడ్డాయి అని తెలియజేస్తుంది
మోషే మిధ్యానులో గడిపిన సమయములో కూడా ఇశ్రాయేలీయుల చరిత్ర గురించి తెలుసుకునే అవకాశము ఉన్నది
మోషే యొక్క మరణము గురించి తనకు ముందుగానే దేవుడు ప్రత్యక్షపరచటమును బట్టి ద్వితియోపదేశాకాండము 34లో తనే చివరిమాటలు వ్రాసి ఉండవచ్చు లేదా యెహోషువ అయినా వ్రాసే అవకాశము కలదు.
దేవుడు వ్రాయించటానికి ఆ సమయములో ఇశ్రాయేలీయుల గుంపులో మోషేను మించిన విధ్యావేత్త లేడు. మిగిలినవారు అంతా కూడా బానిసత్వములో ఉండుటవలన వారికి విద్య నేర్చుకునే అవకాశము లేదు.